
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా వెండితెర మీద అడుగుపెట్టిన నటి నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారికపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే నటిగా నిహారిక మూడు సినిమాలు చేసినా ఆ అంచనాలను అందుకోలేకపోయారు. వరుస డిజాస్టర్‌లు రావటంతో ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
అయితే నటనకు దూరంగా ఉన్న సినీరంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. యాక్టింగ్ మానేసి నిర్మాతగా కొనసాగాలనే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్న నిహారిక అదే సంస్థను పూర్తి స్థాయి ప్రొడక్షన్ హౌజ్‌గా మార్చే ఆలోచనలో ఉన్నారట. మరి నిహారికి నిర్మాతగా అయిన సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.