
న్యూఢిల్లీ : ప్రముఖ సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన.. ప్రధానితో భేటీ అయ్యారు. మోహన్‌బాబుతోపాటు ఆయన కుమారుడు మంచు విష్ణు, కోడలు వెరోనికా, కుమార్తె మంచు లక్ష్మి మోదీని కలిసినవారిలో ఉన్నారు. ప్రధానితో సమావేశం చాలా బాగా జరిగిందని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
విష్ణుమూర్తి దశావతారలతో కూడిన పెయింటింగ్‌ను మోదీకి బహుకరించినట్టు విష్ణు చెప్పారు. ‘దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖలతో ఒక్కసారి సమావేశం నిర్వహించాల్సిందిగా మోదీని కోరాను. దానిని ఆయన వెంటనే అంగీకరించారు. త్వరలోనే ఈ భేటీ ఉంటుందని ఆశిస్తున్నాను’ అని విష్ణు పేర్కొన్నారు.



Comments
Please login to add a commentAdd a comment