మరో స్టార్ వారసుడొస్తున్నాడు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన కొడుకు ప్రణవ్‌ను హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమకే చెందిన మరో స్టార్ హీరో మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్‌ను వెండితెరపై పరిచయం చేసిన తరహాలో మోహన్ లాల్ కూడా తన కొడుకును గ్రాండ్‌గా తీసుకురావాలనుకుంటున్నట్టు సన్నిహితులు చెప్పారు. ప్రణవ్ కోసం మోహన్ లాల్ స్క్రిప్టులు వింటున్నట్టు సమాచారం.
కాగా ప్రణవ్ ఇదివరకే బాలనటుడిగా నటించాడు. 2002 కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇక ప్రణవ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. లైఫ్ ఆఫ్ జోసుట్టి సినిమాకు దర్శకుడు జీతు జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. సల్మాన్ 26 ఏళ్ల వయసులో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పుడు ప్రణవ్ వయసు కూడా 26 ఏళ్లే. ప్రణవ్‌పై అంచనాలు భారీగా ఉంటాయని, దీనికి తగినట్టుగా ప్రాజెక్టు ప్లాన్ చేయాలని మోహన్ లాల్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.