మురుగదాస్ తరువాతి హీరోయిన్ ఎవరో?
ముంబై: తమిళ సూపర్ హిట్ దర్శకుడు మురుగదాస్ హిందీలో ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడట. ఈ సినిమాకు సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా సెలక్ట్ చేశాడట. తొందరలోనే ఈ సినిమాకు సెట్స్ పైకి వెళ్ల నుందని సమాచారం. అంతే కాదండోయ్.. ఒకప్పటి ప్రముఖ హీరో, సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా తమిళంలో స్లీపర్ హిట్ అయిన మౌన గురు సినిమాకు రీమేక్. మరో ప్రధానపాత్రలో అనురాగ్ కశ్యప్ కనిపిస్తున్న ఈ సినిమాకు మిగతా నటీనటులను తొందర్లోనే వెల్లడించనున్నారు.