
నాగ చైతన్య, సమంత రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌నే.. రీల్ లైఫ్‌లో పోషించిన మజిలీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి ఆట నుంచే ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. సమంత, నాగచైతన్యల నటనకు విమర్శకులతో పాటు, సినీ ప్రముఖుల నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి.
‘నిన్ను కోరి’ సినిమాతో హిట్ కొట్టిన శివ నిర్వాణ.. మరో అందమైన కథతో మజిలీని తెరకెక్కించాడు. గత వారం విడుదలైనా కూడా ఇప్పటికీ మంచి వసూళ్లతో రన్ అవుతోంది. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు సమాచారం. చైతన్య కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా ఈ మూవీ రికార్డు సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్ నటించారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment