
ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం లాంటి సినిమాల్లో నటించిన నాగ చైతన్య, సమంత.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. వీరి వివాహానంతరం తెరపై మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలి’. ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు సంబరపడుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది.
ప్రేమికుల రోజున ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 14 ఉదయం 9.09గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్‌లో కానుంది.
Comments
Please login to add a commentAdd a comment