నందితా దాస్
నా తండ్రిపై ఆరోషణలు వచ్చినప్పటికి కూడా నేను మీటూ ఉద్యమానికే మద్దతిస్తాను అంటున్నారు ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్. మీటూ ఉద్యమం విస్తరిస్తోన్న నేపథ్యంలో నందితా దాస్ తండ్రి జతిన్ దాస్ మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి. పేపర్ తయారు చేసే ఓ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు జతిన్ దాస్‌పై లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 14 ఏళ్ల క్రితం జతిన్ దాస్ తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆయన చేష్టలు చాలా ‘వల్గర్’గా ఉన్నాయంటూ సదరు మహిళ ఆరోపించారు.
ఈ ఆరోపణలపై జతిన్ దాస్ కుమార్తె నందితా దాస్ స్పందించారు. ‘నా తండ్రి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అయినా ఇప్పటికి కూడా నేను మీటూకే మద్దతిస్తున్నాను. వేధింపులు ఎదుర్కొన్న బాధితులందరికి తోడుగా ఉంటాను. ఇక నా తండ్రి మీద వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. వాస్తవాలను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆరోపణలు చేస్తున్న మహిళలు తమ మాటల పట్ల ఖచ్చితంగా ఉండాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే ఈ ఉద్యమం దెబ్బతినే ప్రమాదం ఉంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment