స్పెషల్‌ ఎట్రాక్షన్‌! | Nani starrer movie to be shot in Prague | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఎట్రాక్షన్‌!

Published Sat, Sep 16 2017 12:15 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

స్పెషల్‌ ఎట్రాక్షన్‌! - Sakshi

స్పెషల్‌ ఎట్రాక్షన్‌!

ప్రాగ్‌... యూరప్‌లోని ఓ దేశం పేరిది. అక్కడ లొకేషన్లు కొత్తగా, అందంగా ఉంటాయట! మన తెలుగు ప్రేక్షకులకు వాటిని చూపించాలని హీరో నాని అండ్‌ కో అక్కడికి వెళ్లారు. నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్దిలు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాగ్‌లో ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ మొదలైంది.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ రాజా’ హిట్స్‌ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుస విజయాల్లో ఉన్న నాని హీరోగా ఈ సినిమా నిర్మిస్తుండడం హ్యాపీగా ఉంది. నాని డ్యూయల్‌ రోల్‌ సిన్మాకు స్పెషల్‌ అట్రాక్షన్‌! కథ, క్యారెక్టరైజేషన్స్‌ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవలే పొల్లాచ్చీలో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం. రషెస్‌ చూసి హ్యాపీగా ఉన్నాం. ప్రాగ్‌లో 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ‘ధృవ’ ఫేమ్‌ ‘హిప్‌ హాప్‌’ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోయిన్లు ఎవరనేది త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement