నయనకు పెళ్లంట? | Nayanaku marriage? | Sakshi
Sakshi News home page

నయనకు పెళ్లంట?

Published Tue, Mar 25 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

నయనకు పెళ్లంట?

నయనకు పెళ్లంట?

 రాజారాణి చిత్రం వలే ఇదు నమ్మ ఆళు చిత్రం ప్రమోషన్ కోసం నయనతారకు పెళ్లంట నినాదంతో పోస్టర్లు రూపొందించనున్నారు. శింబు, ప్రభుదేవాలను విడిచిన తర్వాత ఆర్యతో స్నేహంగా ఉంటూ వచ్చారు నయనతార. దీనిని తన చిత్రం ప్రమోషన్‌కు ఉపయోగించుకునేందుకు నిర్ణయించిన డెరైక్టర్ అడ్లి రాజారాణి చిత్రం పోస్టర్‌లో ఆర్య వెడ్స్ నయనతార అంటూ ముద్రించి క్రైస్తవ సంప్రదాయ రీతిలో ఇరువురు వివాహం జరుపుకుంటున్నట్లు నగరంలో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపాయి.

 

క్యారెక్టర్ పేర్లతో కాకుండా తమ సొంత పేర్లతో ఎందుకు పోస్టర్లు రూపొందించారంటూ నయనతార డెరైక్టర్‌ను నిలదీశారు. ఈ విషయంలో గుర్రుగా ఉన్న నయనతార ఆ చిత్రం ఫంక్షన్లలో ఆమె పాల్గొనలేదని తెలుస్తోంది. ఈ స్థితిలో శింబుతో మళ్లీ జంటగా ఇదు నమ్మ ఆళు చిత్రంలో నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా రాజా రాణి చిత్రం వలే దంపతుల ప్రేమ కథ. ఇందులోనూ వివాహ దృశ్యం ఒకటి చోటు చేసుకొంటుంది. మే 1వ తేదీ ఈ చిత్రం పోస్టర్లను విడుదల చేసే సమయంలో శింబు, నయనతార వివాహం అంటూ వివాహ అలంకరణలో ఉన్న ఫొటోలతో పబ్లిసిటీ చేసేందుకు శింబు నిర్ణయించారు.

 

ఈ వ్యవహారం గురించి నయనతారకు తెలియదని ప్రచారం సాగుతోంది. ఆర్య వలే శింబు కూడా నయనతార అనుభూతులను అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నట్లు కోడంబాక్కంలో గుసగుసలు వినిపిస్తున్నాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement