'నా సినిమా ఇంత హిట్ అవుతుందనుకోలే' | Never expected 'Udta Punjab' to be my biggest opening-Shahid Kapoor | Sakshi
Sakshi News home page

'నా సినిమా ఇంత హిట్ అవుతుందనుకోలే'

Published Sun, Jun 26 2016 9:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

'నా సినిమా ఇంత హిట్ అవుతుందనుకోలే'

'నా సినిమా ఇంత హిట్ అవుతుందనుకోలే'

ముంబై : సినిమాలో ఉన్న డ్రామా కంటే.. సినిమా విడుదలకు ముందే బోలెడంత డ్రామాకు తెర తీసిన చిత్రం 'ఉడ్తా పంజాబ్'. పంజాబ్ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ సమస్యను ఇతివృత్తంగా తెరకెక్కించిన  ఈ సినిమా అనూహ్య కలెక్షన్లతో దూసుకుపోతుంది. చిత్ర ఘన విజయం పట్ల హీరో షాహిద్ కపూర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న షాహిద్ మాట్లాడుతూ.. 'నా కెరీర్లోనే అత్యధిక ప్రారంభ వసూళ్లను సాధించిన సినిమా ఇది. ప్రజలంతా సినిమాను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాణిజ్యపరమైన సినిమాలు, వాణిజ్యపరమైన సినిమాలు కానివి అంటూ ఉండవని.. కేవలం మంచి కథనమా కాదా అనేదే ఉంటుందని ఉడ్తా పంజాబ్ మరోసారి నిరూపించింది' అని అన్నారు. (చదవండి: పరాటా కంటే వేగంగా.. మెక్సీకో కన్నా క్రూరంగా..)

ఇప్పటికే రూ.48.5 కోట్ల కలెక్షన్లు సాధించిన ఉడ్తా పంజాబ్.. రూ.50 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది.  కాగా త్వరలో తండ్రి కాబోతున్న షాహిద్..  సైఫ్ అలీ ఖాన్ తో కలిసి 'రంగూన్' అనే మల్టీ స్టారర్లో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement