'ఉడ్తా పంజాబ్'కు రికార్డు కలెక్షన్లు | Udta Punjab records 5th highest opening weekend of 2016 | Sakshi
Sakshi News home page

'ఉడ్తా పంజాబ్'కు రికార్డు కలెక్షన్లు

Published Mon, Jun 20 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

'ఉడ్తా పంజాబ్'కు రికార్డు కలెక్షన్లు

'ఉడ్తా పంజాబ్'కు రికార్డు కలెక్షన్లు

ఈ ఏడాది అత్యంత వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన 'ఉడ్తా పంజాబ్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అభిషేక్ చుబే దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమా తొలి వీకెండ్ లో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ నెల 17న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.33.80 కోట్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన ఐదో చిత్రంగా 'ఉడ్తా పంజాబ్' రికార్డు సృష్టించింది.

షాహిద్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉడ్తా పంజాబ్' గడిచిన ఆదివారం కూడా ధాటిగా కలెక్షన్లు రాబట్టిందని, ఢిల్లీ, పంజాబ్ లలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నదని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ సినిమా తొలిరోజు (శుక్రవారం) రూ. 10.05కోట్లు, రెండోరోజు (శనివారం) రూ. 11.25 కోట్లు, మూడో రోజు (ఆదివారం) రూ. 12.50 కోట్లు.. మొత్తంగా రూ. 33.80 కోట్లను తన ఖాతాలో వేసుకున్నదని ఆయన ట్వీట్ చేశారు.

పంజాబ్ లో విశృంఖలంగా విజృంభిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఎక్కుపెట్టిన అస్త్రంగా 'ఉడ్తా పంజాబ్' తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement