
నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘భీష్మ’. ఈ మూవీ బుధవారం(12-6-19) ఉదయం 10 : 19 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. డిసెంబర్ నెలలో చిత్రాన్ని విడుదల చేసే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతీ అబ్బాయి నితిన్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చేశాం. ప్రతీ యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతారు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది అని తెలిపారు’.
Comments
Please login to add a commentAdd a comment