వివాదంలో మరో తెలుగు సినిమా | NRI Sahadev Complaint against c. kalyan, tandra ramesh | Sakshi
Sakshi News home page

వివాదంలో మరో తెలుగు సినిమా

Published Tue, Jun 6 2017 7:23 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

వివాదంలో మరో తెలుగు సినిమా

వివాదంలో మరో తెలుగు సినిమా

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ ‘దువ్వాడ జగన్నాథం’  సినిమాపై వివాదం సద్దుమణకముందే మరో చిత్రం చిక్కుల్లో పడింది. గోపీచంద్‌ హీరోగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్‌’ సినిమాపై వివాదం రాజుకుంది. ఈ సినిమా కోసం నిర్మాత సి. కళ్యాణ్‌ రూ. 6 కోట్లు తీసుకుని మోసం చేశారని సహదేవ్‌ అనే ఎన్నారై ఆరోపించారు. ఈ మేరకు కళ్యాణ్‌, తాండ్ర రమేశ్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నెల 9న ‘ఆరడుగుల బుల్లెట్‌’ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వివాదం నెలకొనడం గమనార్హం. జయబాలాజీ రియల్‌ మీడియా పతాకంపై బి గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో గోపీచంద్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement