
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను చిత్రం’ తరపున మరో కానుక. ఈ ఉదయం నుంచి సర్ ప్రైజ్ అంటూ ఊరిస్తూ వస్తున్న మేకర్లు కాసేపటి క్రితం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ఈ చిత్ర ఆడియో వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు.
తొలుత ఈ ఆడియోకు ఎన్టీఆర్‌తోపాటు రామ్ చరణ్ కూడా వస్తాడన్న ప్రచారం జరిగింది. అయితే చెర్రీ సంగతి ఏమోగానీ.. ‘భరత్ బహిరంగ సభకు ప్రేమతో యంగ్ టైగర్ ఎన్టీఆర్’ అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. రేపు అంటే శనివారం ఈ చిత్ర ఆడియో వేడుకను ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. కాగా, సాధారణంగా తన సినిమాలకు చీఫ్ గెస్ట్‌లంటూ ప్రాధాన్యం ఇవ్వని మహేష్.. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్‌తో స్టేజీని షేర్ చేసుకోబోతుండటం విశేషం. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన భరత్ అనే నేనుకు దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.
#భరత్_సభకుప్రేమతో_తారక్ pic.twitter.com/da1nn291Fp
— DVV Entertainment (@DVVEnts) April 6, 2018
Comments
Please login to add a commentAdd a comment