మాస్లుక్కు మంచి రెస్పాన్స్
మెగా హీరో వరుణ్తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'లోఫర్'. తొలి రెండు సినిమాలతో ప్రయోగాత్మక చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, ఈ సినిమాతో కమర్షియల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ముకుంద సినిమాతో ఆకట్టుకోలేకపోయిన మెగా వారసుడు, కంచె సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించాడు. ఇప్పుడు లోఫర్ సినిమాతో కమర్షియల్ స్టార్గా కూడా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్తో పాటు ట్రైలర్కు కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన లోఫర్ ట్రైలర్ ఆన్లైన్లో పదిలక్షల వ్యూస్తో సత్తా చాటింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్కు రెడీ అవుతోంది.