భర్త నిర్మాత... భార్య హీరోయిన్! | Participate in 'Drishyam' Contest and Get a Chance to Meet Ajay Devgan | Sakshi
Sakshi News home page

భర్త నిర్మాత... భార్య హీరోయిన్!

Published Mon, Jul 27 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

భర్త నిర్మాత... భార్య హీరోయిన్!

భర్త నిర్మాత... భార్య హీరోయిన్!

 ‘దిల్‌వాలే’ షూటింగ్‌తో కాజోల్ చాలా బిజీగా ఉన్నారు. అలాగే  ఆమె భర్త, హీరో అజయ్ దే వ్‌గణ్ తాను హీరోగా నటించిన మలయాళ ‘దృశ్యం’ హిందీ రీమేక్ ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. మరి.. మీరు, మీ సతీమణి జంటగా సినిమా చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్న అజయ్ దేవ్‌గణ్ ముందుంచితే -‘‘ఇప్పుడా ప్లాన్స్ ఏవీ లేవు’’ అన్నారు. కాకపోతే,  తాను నిర్మాతగా మారి కాజోల్  హీరోయిన్‌గా ఓ చిత్రాన్ని నిర్మిస్తాన న్నారు. ‘‘మా ఇద్దరి కాంబినేషన్‌కి నప్పే కథ  రెడీగా లేదు. కాజోల్ ఇప్పుడు నటిస్తున్న ‘దిల్‌వాలే’ షూటింగ్ అయిపోతే, డిసెంబర్‌లో తను హీరోయిన్‌గా ఓ చిత్రాన్ని మొదలుపెడతా. మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం’’అని అజయ్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement