పవన్ ప్రెస్ మీట్ వాయిదా.. మార్చి9, లేదా 11?
రాజకీయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ మార్చి 5 తేదిన ఓ ప్రకటన చేస్తారనే వార్తలు మంగళవారం సాయంత్రం నుంచి మీడియాలో షికారు చేశాయి.
రాజకీయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ మార్చి 5 తేదిన ఓ ప్రకటన చేస్తారనే వార్తలు మంగళవారం సాయంత్రం నుంచి మీడియాలో షికారు చేశాయి. మీడియాలో నెలకొన్న గందరగోళాన్ని తగ్గించేందుకు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై ఆయనకు సన్నిహితులైన పంజా నిర్మాత నీలిమ తిరుమలశెట్టి సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.
'ఊహాగానాలు, గందరగోళానికి తెరదించి.. ప్రశాంతంగా ఉండండి'. సందేహాలన్నింటికి పవన్ త్వరలోనే తెరదించుతారు అని ట్విటర్ లో పోస్ట్ చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగం 'యువరాజ్యం'లో నీలిమ తిరుమలశెట్టి కీలక బాధ్యతలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, మార్చి 9 తేది లేదా, 11 తేదిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.