పెదనాన్న ఒళ్లో పవన్ కూతురు! | Pawan's kids spend time with Chiru's family | Sakshi
Sakshi News home page

పెదనాన్న ఒళ్లో పవన్ కూతురు!

Published Thu, Sep 18 2014 12:33 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పెదనాన్న ఒళ్లో పవన్ కూతురు! - Sakshi

పెదనాన్న ఒళ్లో పవన్ కూతురు!

పవన్ కల్యాణ్ కూతురు ఆధ్య చాలాకాలం తర్వాత ఫొటోల్లో కనిపించింది. పెద్ద పెదనాన్న చిరంజీవి ఒళ్లో కూర్చుని అమాయకంగా చూస్తూ కెమెరా కంటికి చిక్కింది. పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ చాలాకాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి రేణు దేశాయ్ పుణెలో ఉంటూ దర్శకత్వంలో బిజీగా గడుపుతోంది. ఇటు పవన్ కూడా తన సినిమాలతో బిజీగానే ఉంటున్నారు.

పవన్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆధ్య తల్లితో కలిసి పుణెలో ఉంటున్నారు. ఇటీవల రాంచరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఆడియో ఆవిష్కరణ సందర్భంగా వాళ్లంతా హైదరాబాద్ వచ్చి, తండ్రితోను, మెగాస్టార్ కుటుంబంతోను కొద్దిసేపు గడిపారు. చిరంజీవి మనవరాలు (శ్రీజ కుమార్తె) కూడా వాళ్లతో పాటు ఉంది. ఆమె తన అమ్మమ్మ ఒళ్లో కూర్చుని ఉంది.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement