
విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌లకు చైన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారు. దర్శకుడు శంకర్.. లైకా పోడక‌్షన్‌లో నిర్మిస్తున్న ‘ఇండియన్ -2’ సినిమా సెట్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు(28)తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ(34).. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్(60) ఉన్నారు. ఈ ఘటనపై చెన్నైలోని పూనమలి పోలీసులు లైకా ప్రొడక్షన్స్ అధినేత, చిత్ర నిర్మాత ఎ.సుబస్కరన్‌లపై కేసు నమోదు చేసి నోటిసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రమాదం నుంచి హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటీలో తప్పించుకోగా, డైరెక్టర్ శంకర్ కాలికి గాయమైంది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (కోటి రూపాయలు ప్రకటించిన కమల్‌హాసన్)
కాగా మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల చోప్పు కమల్ హాసన్ ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించాడు. అంతేగాక హస్పీటల్‌లో చికిత్స పొందుతున్న గాయపడ్డ 10 మందిని ఆయన పరామర్శించి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. లైకా పోడక్షన్ సంస్థ కూడా వారికి సాయం అందిస్తుంది. దర్శకుడు శంకర్ కూడా తోడుంటానని హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనపై చైన్నై పోలీసులు లైకా సంస్థ యజమానితో పాటు, చిత్ర నిర్మాతలపై.. క్రేన్ యాజమాని, ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్ 287(యంత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించడం), 377 పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment