lika productions
-
కమల్ హాసన్‌కు పోలీసు నోటీసులు
విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు చైన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారు. దర్శకుడు శంకర్.. లైకా పోడక‌్షన్‌లో నిర్మిస్తున్న ‘ఇండియన్ -2’ సినిమా సెట్లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు(28)తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ(34).. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్(60) ఉన్నారు. ఈ ఘటనపై చెన్నైలోని పూనమలి పోలీసులు లైకా ప్రొడక్షన్స్ అధినేత, చిత్ర నిర్మాత ఎ.సుబస్కరన్‌లపై కేసు నమోదు చేసి నోటిసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రమాదం నుంచి హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటీలో తప్పించుకోగా, డైరెక్టర్ శంకర్ కాలికి గాయమైంది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (కోటి రూపాయలు ప్రకటించిన కమల్‌హాసన్) కాగా మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల చోప్పు కమల్ హాసన్ ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించాడు. అంతేగాక హస్పీటల్లో చికిత్స పొందుతున్న గాయపడ్డ 10 మందిని ఆయన పరామర్శించి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. లైకా పోడక్షన్ సంస్థ కూడా వారికి సాయం అందిస్తుంది. దర్శకుడు శంకర్ కూడా తోడుంటానని హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనపై చైన్నై పోలీసులు లైకా సంస్థ యజమానితో పాటు, చిత్ర నిర్మాతలపై.. క్రేన్ యాజమాని, ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్ 287(యంత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించడం), 377 పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెట్లో ప్రమాదం: అసలేం జరిగింది? -
తమిళ తెరకు దారి!
తెలుగులో హిట్టయిన ‘100% లవ్’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలు తమిళంలో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడీ దారిలో మరో సినిమా చేరింది. ఆ సినిమా ‘అత్తారింటికి దారేది’. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకుంది. నవంబర్ 29న విడుదల కానున్న రజనీకాంత్ ‘2.0’ని నిర్మించింది లైకానే. ఇంకా పలు భారీ చిత్రాలను నిర్మించడంతో పాటు విడుదల కూడా చేస్తుంటుంది. ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో హీరోగా ఎవరు నటిస్తారు? అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అత్త పాత్రకు మాత్రం నదియానే తీసుకుంటారని ఊహించవచ్చు. ఎందుకంటే తెలుగు వెర్షన్లో అత్త పాత్రను ఆమె బ్రహ్మాండంగా చేసిన విషయం సినిమా చూసినవారికి గుర్తుండే ఉంటుంది. -
కేస్ లేదు బాస్!
ఫ్లాష్.. ఫ్లాష్.. అమెరికన్ వీఎఫ్ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్) కంపెనీ రజనీకాంత్ ‘2.0’ గ్రాఫిక్స్ పనులను తారుమారుగా చేసిందట. అందుకని ఈ చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆ కంపెనీ మీద కేస్ పెట్టబోతోందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే ఇక సినిమా ఏప్రిల్‌లో కూడా రావడం కష్టమేనట... శనివారం అటు చెన్నై కోడంబాక్కమ్ ఇటు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో షికారు చేసిన వార్త ఇది. శంకర్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘2.0’ విడుదల ఇప్పటికే పలు మార్లు వాయిదా పడటం, అభిమానులు నిరుత్సాహపడటం తెలిసిందే. మళ్లీ వాయిదా అంటే.. ఈసారి అభిమానుల ఆవేదన ఆగ్రహంగా మారే ప్రమాదముంది. అందుకే లైకా సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ (27వ తేదీ అనుకుంటున్నారు)లో సినిమాని విడుదల చేయాలనుకుంటోంది. మరి.. ఈ కేస్ సంగతేంటి బాస్ అనే విషయానికొస్తే.. ‘లైకా’ సంస్థ ప్రతినిధిని ‘సాక్షి’ సంప్రదించింది. ‘‘అలాంటిదేం లేదు. ఇప్పటి (శనివారం సాయంత్రం) వరకూ అలాంటి ఆలోచనే లేదు. లాస్ ఏంజిల్స్‌లోని వీఎఫ్ఎక్స్ కంపెనీలో పనులు జరుగుతున్నాయి. ఒకే కంపెనీ ఆధ్వర్యంలో జరిగితే ఏప్రిల్ కల్లా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే అక్కడి మరో ప్రముఖ వీఎఫెక్స్ కంపెనీకి వర్క్‌ని డివైడ్ చేశామంతే’’ అని స్పష్టం చేశారు. ‘2.0’ రిలీజ్‌ని ప్రకటించడంతో తెలుగులో మహేశ్‌బాబు (‘భరత్ అనే నేను’), అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదల డైలమాలో పడ్డాయి. అక్కడ తమిళంలో కూడా అలా జరిగిందా? అని అడిగితే – ‘‘2.0’ రిలీజ్ టైమ్‌కి ఓ రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అయితే ‘2.0’ కోసం వాళ్లంతట వాళ్లు తమ సినిమా విడుదల తేదీని మార్చుకున్నారు’’ అని పేర్కొన్నారు. -
లైకా పేరు తీసి.. రేపే 'కత్తి' విడుదల
కత్తి సినిమా విడుదలకు రంగం సిద్ధమైపోయింది. ఈ సినిమా విషయంలో నెలకొన్న వివాదంపై హీరో విజయ్ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'లైకా' పేరును సినిమా నుంచి తొలగిస్తున్నట్లు అందులో విజయ్ చెప్పారు. షెడ్యూలు ప్రకారమే.. అంటే బుధవారమే తమిళనాడులో సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా విషయంలో నెలకొన్న అభ్యంతరాలన్నీ తొలగినట్లు అయ్యింది. అంతకుముందు కత్తి చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పడంతో సోమవారం రాత్రి చెన్నైలో పలు థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వారు. ఆ దాడిలో రెండు థియేటర్లు ధ్వంసమయ్యాయి. థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మెహరించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే మహింద రాజపక్సపై తమిళనాడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిమాండును అంగీకరించడంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.