ప్రభాస్ కొత్త కారు 8 కోట్లా..? | Prabhas Bought a Brand New Rolls Royce Car Which Costs Rs. 8 Crore | Sakshi
Sakshi News home page

ప్రభాస్ కొత్త కారు 8 కోట్లా..?

Published Tue, Dec 29 2015 3:10 PM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

ప్రభాస్ కొత్త కారు 8 కోట్లా..?

ప్రభాస్ కొత్త కారు 8 కోట్లా..?

బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాయటమే కాదు... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ మరో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నాడు.

బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాయటమే కాదు... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ మరో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, ఇళయదళపతి విజయ్ లాంటి టాప్ స్టార్లు మాత్రమే వాడుతున్న ప్రెస్టీజియస్ రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకొని టాప్ ప్లేస్లో నిలిచాడు. టాలీవుడ్లో చాలా మంది హీరో ఖరీదైన లగ్జరియస్ కార్లను వాడుతున్నారు. అయితే వారందరినీ మించి ఏకంగా 8 కోట్లు ఖర్చు పెట్టి రోల్స్ రాయిస్ ఫాంతమ్ కారును తెప్పించుకున్నాడు ప్రభాస్.

ఇటీవలే ఈ కారు డెలివరీ కావటంతో తన సన్నిహితులకు భారీ పార్టీ ఇచ్చాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బాహుబలి పార్ట్ 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2016 డిసెంబర్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. బాహుబలి తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వల్పై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement