
తండ్రికి విలన్... కుమారుడికి?
హీరోయిజమ్, విలనిజమ్... జగపతిబాబు నటనలో రెండిటినీ తెలుగు ప్రేక్షకులు చూశారు.
హీరోయిజమ్, విలనిజమ్... జగపతిబాబు నటనలో రెండిటినీ తెలుగు ప్రేక్షకులు చూశారు. మలయాళీలకు ఆయన నటనలోని విలనిజమ్ మాత్రమే తెలుసు. అసలు పేరు కంటే కొసరు పేరు ‘డాడీ గిరిజ’గా అక్కడి ప్రేక్షకులకు తెలుసు. మోహన్‌లాల్ ‘పులి మురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలైంది)లో డాడీ గిరిజగా జగపతిబాబు ప్రదర్శించిన విలనిజమ్ అటువంటిది మరి! మలయాళంలో ఆయన నటించిన తొలి చిత్రమది. తాజాగా మరో చిత్రం అంగీకరించారు. ఇందులో మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ హీరో. సిన్మా పేరు ‘ఆది’. అప్పుడు మోహన్‌లాల్ ‘పులి మురుగన్’తో మలయాళంలో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న జగపతిబాబు, ఇప్పుడు ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ‘ఆది’లోనూ విలన్‌గా నటిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని యూనిట్ సభ్యులు ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచారు!