'షారూక్ సినిమాతో పోటీ కాదు' | priyanka chopra about clash with sharukh film | Sakshi
Sakshi News home page

'షారూక్ సినిమాతో పోటీ కాదు'

Nov 29 2015 1:52 PM | Updated on Sep 3 2017 1:13 PM

'షారూక్ సినిమాతో పోటీ కాదు'

'షారూక్ సినిమాతో పోటీ కాదు'

బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద వచ్చే నెల ఆసక్తి కరమైన పోటీ జరగనుంది.

బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద వచ్చే నెల ఆసక్తి కరమైన పోటీ జరగనుంది. టాప్ స్టార్స్తో రూపొందిన రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో బాలీవుడ్ తెర మీద పోటికి దిగుతున్నాయి. క్రిస్టమస్ సీజన్ కావటంతో ఈ గ్యాప్ను క్యాష్ చేసుకునేందుకు రెండు చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా.. ఒక సినిమాకు మరో సినిమా పోటీ కాందంటున్నారు చిత్రయూనిట్.

చాలా ఏళ్ల తరువాత బాలీవుడ్ ఐకానిక్ పెయిర్ షారూక్ ఖాన్, కాజోల్లు కలిసి నటిస్తున్న దిల్ వాలే సినిమా డిసెంబర్ రెండో వారంలో రిలీజ్కు రెడీ అవుతుంది. మాస్ సినిమాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్లో వరుణ్ దావన్, కృతి సనన్లు కూడా లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ  సినిమాతో పాటు కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామా బాజీరావ్ మస్తానీ కూడా అదే సమయంలో రిలీజ్ కానుంది. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ఇటీవల బాజీరావ్ మస్తానీ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న హీరోయిన్ ప్రియాంక మాత్రం ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ కావని, ఒకే సమయంలో రిలీజ్ అయినా.. పెద్దగా సమస్య ఉండదని చెపుతోంది. దిల్వాలే పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్, బాజీరావ్ మస్తానీ వార్ డ్రామా. ఈ రెండు సినిమాలకు ఎక్కడా పోలిక లేదు కనుక ఒకేసారి రిలీజ్ అయిన కలెక్షన్ల పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement