
వరుస పరీక్షల అనంతరం సింగర్ కనికాకపూర్ కరోనా నుంచి బయటపడిన విషయం బాలీవుడ్‌కు కాస్త ఊరటనిచ్చింది. ఇంతలోనే బడా నిర్మాత కూతురుకు కరోనా సోకిన విషయం అందరినీ కలవరపరుస్తోంది. చెన్నై ఎక్స్‌ప్రెస్, రావన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాత, హీరో షారుఖ్ ఖాన్ ఆప్త మిత్రుడు కరీం మొరానీ. అతడి కూతురు షాజా జరానీ.. అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. మరోవైపు ముంబైలోని జుహు ప్రాంతంలో నివసిస్తున్న అతడి కుటుంబం పద్నాలుగు రోజులపాటు స్వీయ నిర్బంధం విధించుకుంది. (కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయని)
అతడి ఇంట్లో నివసించే తొమ్మిది మంది వ్యక్తులకు మంగళవారం కోవిడ్-19 పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా షాజా జరానీ ఆల్వేస్ కబీ కబీ, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. కాగా కరోనాపై వ్యతిరేక పోరాటానికి సెలబ్రిటీలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్థికసాయంతోపాటు, హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలోనూ తమ అభిమానులకు కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నారు. (ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..)
Comments
Please login to add a commentAdd a comment