రాజమౌళికి తప్పుడు సమాచారమిచ్చారు!
తమిళసినిమా: దర్శకుడు రాజమౌళికెవరో తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని ఎవర్‌గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి పేర్కొన్నారు. బహుభాషా నటిగా రాణిస్తున్న ఈ భామ తాజా చిత్రం మామ్‌తో 300 చిత్రాల మైలు రాయిని చేరుకున్నారు. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్‌లో శివగామి పాత్రకు మొదట ఈమెను నటింపజేయాలని దర్శకుడు భావించారట. శ్రీదేవి నిరాకరించడంతో ఆ లక్కీచాన్స్ నటి రమ్యకృష్ణను వరించింది. ఆ పాత్రతో రమ్యకృష్ణ పేరు ఎక్కడో వెళ్లి పోయిందది. దీంతో శివగామి పాత్రను ఎందుకు మిస్ అయ్యారంటూ శ్రీదేవిపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
అటు దర్శకుడు రాజమౌళికి ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. అయితే ఇటీవల ఆయన శ్రీదేవి గురించి ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. దానికి శ్రీదేవి వెంటనే స్పందించారు. ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను బాహుబలి చిత్రంలో నటించడానికి పలు నిబంధనలను విధించానని రాజమౌళి చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. తాని ప్పటికి 300 చిత్రాల్లో నటించానని, అలాంటి నిబంధనలు విధిస్తే తననెప్పుడో సినిమా నుంచి పంపించేసే వారని అన్నారు. తానూ ఒక నిర్మాత భార్యానేనని, తనకూ నిర్మాతల సాధకబాధకాలు తెలుసునని అన్నారు. తన గురించి రాజమౌళికెవరో తప్పుడు సమాచారం అందించారని శ్రీదేవి పేర్కొన్నట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.