బోనాల పోతరాజుగా... | R. Narayana Murthy bonalu potharaju movie opening | Sakshi
Sakshi News home page

బోనాల పోతరాజుగా...

Published Sat, Mar 21 2015 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

బోనాల పోతరాజుగా...

బోనాల పోతరాజుగా...

 ఆర్.నారాయణమూర్తి ఇప్పటి వరకూ తన సొంత నిర్మాణ సంస్థలోనే ఎక్కువగా సినిమాలు చేశారు. చాలా ఏళ్ల విరామం తర్వాత వేరే సంస్థలో హీరోగా ‘బోనాల పోతరాజు’ అనే సినిమా చేస్తున్నారు. దానికి కథ ఆయనదే. సానా యాదిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఉగాది రోజున హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్, శివాజీ గణేశన్‌లు చేయదగ్గ గొప్ప పాత్రను నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు.
 
 ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘జానపద కథలు చెబుతూనే ప్రజా సినిమాగా తీర్చిదిద్దుతాం. అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని, ఆత్మీయతను ప్రతిబింబించే విధంగా రూపొందించే ఈ చిత్రంలో ఆర్.నారాయణమూర్తి టైటిల్ రోల్ పోషించడం మా అదృష్టం. ఏప్రిల్ 15న షూటింగ్ ప్రారంభించి, జూలై నెలలో జరిగే అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement