
బ్యాక్ షో...డెబ్భైవేలు!
శుక్రవారం సాయంత్రం... హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక ప్రాంగణం... ‘పండగ చేస్కో’ ఆడియో వేడుక హంగామా... సరిగ్గా ఆరున్నర గంటలకు ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి దేవకన్య దిగింది. అవును నిజమే... రకుల్ ప్రీత్ సింగ్ దేవకన్యలానే ఉన్నారు. అసలే గులాబీ రంగులో మెరిసిపోతున్న రకుల్‌కి ఆమె ధరించిన పొడవాటి పింక్ కలర్ గౌన్ రెట్టింపు అందాన్ని తీసుకొచ్చింది. ఆ గౌన్‌ని చూడాలో... రకుల్‌ని చూడాలో... కళ్లకే కన్‌ఫ్యూజన్.
ఆ గౌను స్పెషాల్టీ ఏమంటే... బ్యాక్ పార్ట్ అంతా హాఫ్ వరకూ ఓపెన్. దాంతో రకుల్ వీపు వెన్నెల సంద్రపు ఒడ్డులా మిళమిళలాడుతోంది. మామూలుగానే ఆ ఫంక్షన్‌కి రకుల్ సెంటరాఫ్ ఎట్రాక్షన్. ఈ గౌను పుణ్యమా అంటూ ఆమె డబుల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇంతకీ గౌను ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా... 70 వేల రూపాయలు. అమ్మో అని గుండెలు బాదుకుంటున్నారా? హీరోయిన్ అన్నాక ఆ మాత్రం స్పెషల్ ఉండాలి కదా. రకుల్ తన వీపు చూపించడానికి 70 వేలు ఖర్చు పెట్టిందని కుర్రకారు మాత్రం తెగ ఆనందపడుతున్నారు.
భయపడుతూనే వేసుకున్నా: ‘‘అసలు ఈ ఫంక్షన్‌కి నేను చీర కట్టుకోవాలనుకున్నాను. నా పర్సనల్ స్టయిలిస్ట్ నీరజ కోనను ఏదైనా మంచి డిజైనర్ శారీ సెలక్ట్ చేయమని అడిగితే, ఓ పొడవాటి గౌను ఫొటో పంపించి, ఇది బాగుంటుందని చెప్పింది. ‘బ్యాక్ మరీ ఇంత ఓపెన్‌గా.. బాగుంటుందో? లేదో?’ అని భయపడ్డా. కానీ, తనే కన్విన్స్ చేసి, గౌరీ అండ్ నైనికాతో ఈ గౌను డిజైన్ చేయించింది. ఇండియాలో వాళ్లు బెస్ట్ డిజైనర్స్. అయినప్పటికీ భయపడుతూనే వేసుకున్నా. బాగానే ఉన్నట్లనిపించింది. తీరా ఆడియో ఫంక్షన్‌కి వెళ్తే, బోల్డన్ని కాంప్లిమెంట్స్. చాలా మంది ఫోన్ చేసి మరీ, అభినందించారు. ఈ అభినందనల తాలూకు క్రెడిట్ అంతా నీరజకే దక్కుతుంది.’’