కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే! | pandaga chesko movie song shooting in Annapurna Studios | Sakshi
Sakshi News home page

కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే!

Published Wed, Apr 22 2015 11:26 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే! - Sakshi

కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే!

ఓ పక్క బందరు లడ్డులాంటి సుందరాంగి... ఇంకో పక్క జాంపండులాంటి కోమలాంగి... నారి నారి నడుమ మురారిలాగా చాకులాంటి కుర్రాడు! మంచి లొకేషన్ కుదిరింది. అకేషన్ అదిరింది. ఇంకేముంది... డ్యూయట్ స్టార్ట్. ‘‘జాంపేట కాడ కన్ను కొట్టేస్తనే! నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తనే! కొత్తపేట కాడ కొంగు లాగేస్తనే! కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే!’’... ఇదంతా ‘పండగ చేస్కో’ పాట సంరంభం. రామ్, రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్‌లపై ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో జానీ నృత్య దర్శకత్వంలో, భాస్కరభట్ల రాసిన ఈ పాటను భారీ ఎత్తున చిత్రీకరించారు దర్శకుడు మలినేని గోపీచంద్.
 
  పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ పాటతో పూర్తయింది. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ ఛానల్ చాలా క్రేజీ ఆఫర్‌తో చేజిక్కించుకున్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement