'మహేష్ సరసన నటించాకే పెళ్లి' | Rakuls Marriage Depends On Mahesh Babu | Sakshi
Sakshi News home page

'మహేష్ సరసన నటించాకే పెళ్లి'

Published Fri, May 13 2016 11:03 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

'మహేష్ సరసన నటించాకే పెళ్లి' - Sakshi

'మహేష్ సరసన నటించాకే పెళ్లి'

ప్రజెంట్ టాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో లేదన్న బాధలో ఉన్న రకుల్కు సరైనోడు సినిమాతో ఘనవిజయం దక్కింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి ప్రస్థావన తీసుకువస్తే ఇప్పట్లో ఆ ఆలోచన లేదంటూ మాట దాటవేస్తారు, కానీ రకుల్ మాత్రం అలా చేయలేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటించిన తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ తేల్చి చెప్పింది.

ప్రస్తుతం రామ్చరణ్ సరసన ధృవ సినిమాతో పాటు, సాయిధరమ్ తేజ్ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది. వీటితో పాటు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామాతో తమిళ ఇండస్ట్రీలో రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. స్టార్ హీరోలతో బిజీగా ఉన్న రకుల్ మహేష్తో ఆడిపాడే ఛాన్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తోంది. మరి రకుల్ కోరికను మహేష్ ఎప్పటికి తీరుస్తాడో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement