
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. పలువురు ప్రముఖులు జనాల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కోవిడ్-19 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరు సుత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం సులువుగా బయటపడగలమని తెలిపారు. ‘పరిశుభ్రంగా ఉందాం.. క్షేమంగా ఉందాం’ అని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్ : చేతులు సబ్బుతో మొచేతి వరకు కడుక్కోండి. గోళ్ల సందుల్లో కూడా. బయటికి వెళ్లివచ్చినప్పుడో, భోజనానికి ముందో.. కనీసం ఇలా రోజుకు 7-8 సార్లు.
రామ్‌చరణ్ : కరోనా వైరస్ తగ్గేవరకు తెలిసిన వాళ్లు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం. ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేళ్లు పెట్టుకోవడం కూడా మానేయాలి.
ఎన్టీఆర్ : మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్‌లు వేసుకోవాలి. ఏమి లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతిని కాకుండా.. మొచేతిని అడ్డం పెట్టుకుండి.
రామ్‌చరణ్ : జనం ఎక్కువగా ఉండే చోటుకు వెళ్లకండి. మంచి నీళ్లు ఎక్కువ తాగండి. గడగడ అని తొందరగా తాగేకన్నా ఎక్కువసార్లు కొంచెం, కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్లు అయితే ఇంకా మంచింది.
ఎన్టీఆర్ :వాట్సాప్‌లో వచ్చే ప్రతి వార్తను నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా భయానక పరిస్థితులు నెలకొంటాయి. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. డబ్ల్యూహెచ్‌వో వెబ్‌సైట్‌లో ఇచ్చే సూచనలను ఫాలో అవుదాం.
రామ్‌చరణ్ : కోవిడ్-19 మీద ప్రభుత్వం ఇచ్చే సలహాలు, అప్‌డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే రక్షించుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment