సాక్షి, హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్చరణ్ షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫోటోతో పాటు అతడు పెట్టిన క్యాప్షన్‌కు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. గతంలో హరిద్వార్‌లో దిగిన ఫోటోలను చెర్రీ ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘గతంలో హరిద్వార్‌లో తీసుకున్న ఫొటో ఇది. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు పరిస్థితులకు తగ్గట్టు మసలుకోవడమే ఉత్తమం. సురక్షితంగా ఉండండి’ అంటూ చెర్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ జత చేశాడు. (ప్రభాస్ కళ్లు నాకు చాలా ఇష్టం..)
ఇక సినిమా షూటింగ్‌లకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినివ్వడంతో త్వరలోనే ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్)తో రామ్‌చరణ్ మళ్లీ బిజీ కానున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ చెర్రీ నటిస్తున్న విషయం తెలిసిందే. (ట్రెండింగ్‌లో టీజర్.. సంతోషంలో బాలయ్య)
Throwback - In Haridwar.
— Ram Charan (@AlwaysRamCharan) June 11, 2020
Right now going with the flow and hoping that things get back to normal. Stay safe. pic.twitter.com/dDVJFpeNgq
Comments
Please login to add a commentAdd a comment