అదిరిపోయిన వర్మ ‘బ్యూటిపుల్‌’ సాంగ్‌ | Ram Gopal Varma Beautiful Movie Song Out | Sakshi
Sakshi News home page

అదిరిపోయిన వర్మ ‘బ్యూటిపుల్‌’ సాంగ్‌

Dec 23 2019 9:23 PM | Updated on Dec 23 2019 9:47 PM

Ram Gopal Varma Beautiful Movie Song Out - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న నూతన చిత్రం బ్యూటీపుల్‌. ట్రిబ్యూట్‌ టు రంగీలా అనేది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా, అగస్త్య మంజు దర్శకత్వంలో టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్‌కుమార్‌, టి.శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ సోమవారం విడుదైలంది. ‘బ్యూటిపూల్‌.. బ్యూటిపుల్‌  బ్యూటిపుల్‌ లైఫ్‌’  అంటూ సాగే ఈ పాట అందరికి ఆకట్టుకుంటుంది. శైలీ బిద్వికార్‌ ఆలపించిన ఆ పాటకి సిరాశ్రీ  లిరిక్స్‌ అందించారు.

ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌, సింగిల్స్‌కి విశేష స్పందన లభించింది. వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ ఈ చిత్రంలో రొమాంటిక్‌గా కనిపిస్తూ యువ ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి రవి శంకర్‌ సంగీతాన్ని అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement