
ముంబై: బయోగ్రాఫికల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నవేళ అలాంటివి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ బయోపిక్‌ను కూడా తెరకెక్కాలని ఆయన సతీమణి సాగరిక ఘట్గే ఆశిస్తోంది. జహీర్ బయోపిక్‌లో హీరో రణబీర్ కపూర్ అయితేనే పక్కాగా సూటవుతాడని, అతను మాత్రమే పాత్రకు న్యాయం చేయగలడని ఆమె అన్నారు. ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ఈ జంటను మీడియా పలకరించిన సమయంలో సాగరిక తన మనసులో మాటను బయటపెట్టారు.
రణబీర్ నటించిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ జూన్ 29న విడుదలకానున్న సంగతి తెలిసిందే. మరి జహీర్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తారా, లేక సాగరికానే నిర్మిస్తారా, అందులో నటించేందుకు రణబీర్ అంగీకరిస్తాడా.. ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నలు. కాగా, సాగరిక ప్రస్తుతం ‘మాన్‌సూన్ ఫుట్‌బాల్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గృహిణులు అంతా కలిసి ఒక ఫుట్‌బాల్ జట్టుగా ఏర్పడటమనే స్ఫూర్తిదాయక ఇతివృత్తంలో ఆ సినిమా తెరకెక్కుతున్నది. జహీర్‌ను మనువాడిన తర్వాత సాగరిక నటిస్తోన్న తొలి సినిమా ఇదే!
Comments
Please login to add a commentAdd a comment