యుద్ధభూమిలో ఉన్నాం.. : రష్మిక | Rashmika Mandanna Says We Will Succeed Over Coronavirus | Sakshi
Sakshi News home page

యుద్ధభూమిలో ఉన్నాం.. : రష్మిక

Apr 20 2020 10:06 AM | Updated on Apr 20 2020 10:30 AM

Rashmika Mandanna Says We Will Succeed Over Coronavirus - Sakshi

యుద్ధ భూమిలో ఉన్నాం.. విజయం సాధిస్తాం.. అంటోంది నటి రష్మికా మందన్నా. కరోనా మహమ్మారి భీతిలో ఉన్న ప్రజలకు ప్రముఖులు తమవంతు సాయం చేయడంతో పాటు, తగినంత మనోధర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నటి రష్మిక ఇదే చేసింది. లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో ట్విట్టర్‌లో చేతిలో వెలుగుతున్న జ్యోతిని పట్టుకున్న ఫొటోను పోస్ట్‌ చేశారు.  ‘ఒక్క క్షణం కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి. మనం ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నాం. విజయం సాధిస్తాం. ఇతరులకు చేయం చేయండి’ అని పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. దీంతో చిత్తూరు యాసను పక్కాగా నేర్చుకోవడానికి రష్మికకు మంచి సమయం దొరికినట్లయింది. రష్మికాయే కాదు.. ‘పుష్ప’ టీమ్‌ అంతా ఈ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు బాగా వినియోగించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement