
కోలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య వివాదాలు చాలా కామన్. ముఖ్యంగా అజిత్, విజయ్ అభిమానులు ప్రత్యక్షంగా తలపడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇటీవల విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ వార్ తారా స్థాయికి చేరింది. జూన్ 22న విజయ్ పుట్టిన రోజున అజిత్ ఫ్యాన్స్ #June22VijayDeathDay (జూన్ 22 విజయ్ చనిపోయిన రోజు) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.
అయితే ఆ సమయంలో విజయ్ ఫ్యాన్స్ హుందాగా స్పందించిన #LongLiveAjith అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేయటంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్ మొదలైంది. అజిత్ ఫ్యాన్స్ మరోసారి #RipVijay అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ కావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్పందించిన విజయ్ ఫ్యాన్స్ #LongLiveVijay అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అయితే ఈ ట్విటర్ వార్‌పై ఇద్దరు హీరోలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.