
నివేదా, సాయిధరమ్, కల్యాణి, కిశోర్ తిరుమల
సాయిధరమ్ తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. కాగా, రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో షురూ అయింది.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కిశోర్ తిరుమల సినిమా అంటేనే క్యూట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటూనే ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌తో ‘చిత్రలహరి’ తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్‌ను సరికొత్త యాంగిల్‌లో చూపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, లైన్ ప్రొడ్యూసర్: కె.వి.వి. బాలసుబ్రమణ్యం, సహ నిర్మాత: ఎం.ప్రవీణ్.
Comments
Please login to add a commentAdd a comment