సల్మాన్ 'ప్రేమలీల' | salaman prem ratan dhan payo telugu title premaleela | Sakshi
Sakshi News home page

సల్మాన్ 'ప్రేమలీల'

Published Sun, Oct 25 2015 11:41 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

సల్మాన్ 'ప్రేమలీల'

సల్మాన్ 'ప్రేమలీల'

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'. సోనమ్ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సూరజ్ బరజాత్య దర్శకుడు. నార్త్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న రాజశ్రీ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

గతంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్పై సల్మాన్ హీరోగా రూపొందిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్ చిత్రాలు ప్రేమ పావురాలు, ప్రేమాలయం పేర్లతో తెలుగులో రిలీజ్ అయి మంచి విజయాలు సాధించాయి. ఆ తరువాత సల్మాన్ హీరోగా నటించిన సినిమాలేవి తెలుగు డబ్ కాలేదు. మళ్లీ ఇంత కాలం తరువాత అదే బ్యానర్లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రాన్ని ప్రేమలీల పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో సల్మాన్ పాత్రకు డబ్బింగ్ చెపుతుండగా, హిందీలో రిలీజ్ అవుతున్న నవంబర్ 12న తెలుగులో కూడా భారీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మరి ఈ కండలవీరుడు సౌత్ ఆడియన్స్ను తన ప్రేమలీలతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement