మళ్లీ ప్రేమలో పడ్డ సమంత? | Samantha fell in love again | Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రేమలో పడ్డ సమంత?

Published Fri, May 13 2016 2:38 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

మళ్లీ ప్రేమలో పడ్డ సమంత? - Sakshi

మళ్లీ ప్రేమలో పడ్డ సమంత?

నేను సింగిల్‌గా ఉంటున్నానని ఎవరు చెప్పారు అంటూ నటి సమంత మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం మంచి జోరుమీదున్నారు. ఇటీవల విజయ్‌తో రొమాన్స్ చేసిన తెరి, తాజాగా విడుదలైన సూర్యతో జత కట్టిన 24 చిత్రాలు వరుసగా విజయం సాధించడమే ఈమె ఖుషీకి కారణం. త్వరలో ధనుష్‌తో కలిసి నటించడానికి సిద్ధమవుతున్న సమంత ఇప్పుడు నటన నుంచి చిన్న విరామం తీసుకుంటున్నారు.
 
 కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలు చుట్టి రావడానికి పయనం అవుతున్నట్లు తను ప్రకటించినా పరిశ్రమలోని ఒక వర్గం మాత్రం తను స్కిన్ ఎలర్జీకి ట్రీట్‌మెంట్ కోసం వెళుతున్నట్టు అంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా సమంత మళ్లీ ప్రేమలో పడ్డట్టు మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే నటుడు సిద్ధార్థ్ ప్రేమలో పడి చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు  ఆ తరువాత కారణాలేమైనా వారి ప్రేమ బ్రే కప్ అయినట్లు ప్రచారం జరిగింది.  
 
 ఇటీవల ఎవరినీ ప్రేమించకుండా ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారన్న ప్రశ్నకు తాను ఒంటరిగా ఉంటున్నట్లు ఎవరు చెప్పారు? అంటూ ఎదురు ప్రశ్నవేయడంతో ఈ భామ మళ్లీ ప్రేమలో పడ్డారన్న ప్రచారానికి ఆస్కారం ఇచ్చినట్లయింది. అయితే ఆ నయా ప్రేమికుడెవ్వరన్నదే తెలియాల్సి ఉందంటున్నారు సినీ వర్గాలు. ఇక తెరి వంటి మాస్ చిత్రంలోనూ 24 వంటి యుక్తితో కూడిన టైమ్ మిషన్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని సమంత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement