‘సుశాంత్‌ భార్యవి నువ్వే అంకిత.. లవ్‌ యూ’ | Sandip Ssingh Heartfelt Post For Ankita Lokhande On Sushant Singh Rajput Demise | Sakshi
Sakshi News home page

‘సుశాంత్‌ భార్య, తల్లీ.. అప్పుడు అన్నీ నువ్వే అంకిత’

Published Sat, Jun 20 2020 5:04 PM | Last Updated on Sat, Jun 20 2020 5:27 PM

Sandip Ssingh Heartfelt Post For Ankita Lokhande On Sushant Singh Rajput Demise - Sakshi

బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో గడిపిన క్షణాలను తలచుకుంటూ అతడి స్నేహితుడు సందీప్‌ సింగ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. సుశాంత్‌ను ఎంతగానో ప్రేమించిన అంకిత గనుక అతడి జీవిత భాగస్వామి అయి ఉంటే.. తను ఈరోజు తమ మధ్యే ఉండేవాడని ఉద్వేగానికి గురయ్యాడు. వారిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారని తాను నమ్ముతున్నానని.. ఆమె సాన్నిహిత్యంలో సుశాంత్‌ ఎంతో సంతోషంగా ఉండేవాడని గుర్తుచేసుకున్నాడు. తమ ముగ్గురి స్నేహం కలకాలం కొనసాగాలని కోరుకుంటే ఇంతలో ఇలా జరిగిందని ఆవేదన చెందాడు. సుశాంత్‌ బలవన్మరణం నేపథ్యంలో అతడి మాజీ ప్రేయసి అంకిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ.. వారిద్దరి ఫ్రెండ్‌ సందీప్‌ సింగ్‌ ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు.(ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!) 

‘‘ప్రియమైన అంకిత, రోజులు గడుస్తున్నా ఆ ఆలోచనలు నన్ను వదలడం లేదు. మనం ఇంకాస్త గట్టిగా ప్రయత్నించాల్సింది, తనను ఆపి ఉండాల్సింది, తనను అర్థించి ఉండాల్సింది! మీరిద్దరు వేరైపోయినప్పటికీ, నువ్వు తన సంతోషం, గెలుపునే ఆకాంక్షించావు. నీ ప్రేమ స్వచ్ఛమైనది. ఎంతో ప్రత్యేకమైనది. నీ ఇంటి నేమ్‌ప్లేట్‌పై నువ్వు ఇంతవరకు సుశాంత్‌ పేరును తొలగించలేదు. ఈనాటికీ నేను నమ్ముతున్నది ఒక్కటే. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీ ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ. ఈ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. గాయపరుస్తున్నాయి... నేనెలా వీటన్నింటిని మరచిపోవాలి! అవన్నీ ఎలా తిరిగి పొందాలి! గతంలోని మనం ముగ్గురం ఎలా ఉన్నామో అచ్చంగా అలాగే మళ్లీ నాకు కావాలి! నాకు తెలుసు నువ్వొక్కదానివే తనను రక్షించగలిగేదానివి. మీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు నేను ఎన్నోసార్లు కలగన్నాను. తను నిన్ను తనతోనే ఉండనివ్వాల్సింది... నువ్వు తన ప్రేమికురాలు, భార్య, తల్లి, ప్రాణ స్నేహితురాలిగా ఉన్నావు. లవ్‌ యూ అంకితా. నీలాంటి స్నేహితురాలిని నేను ఎప్పటికీ వదులుకోలేను’ అంటూ ముగ్గురు కలిసి ఉన్న ఫొటోను శుక్రవారం ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్‌..)

కాగా బుల్లితెర నటుడిగా పరిచయమైన సుశాంత్‌.. ఆ తర్వాత బీ-టౌన్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే టీవీ నటుడిగా ఉన్న సమయంలో ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో తనకు జంటగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్‌ ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లపాటు సజావుగానే సాగిన వీరి బంధంలో కలతలు రేగడంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే వెండితెర హీరోగా బిజీ అయిన తర్వాత సుశాంత్‌కు ఓ హీరోయిన్‌తో స్నేహం పెరగడంతోనే అతడు అంకితకు దూరమైనట్లు వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సుశాంత్‌తో పాటు ఆ హీరోయిన్‌ కూడా ఆ వార్తలను కొట్టిపారేశారు. కానీ అంకిత మాత్రం సుశాంత్‌కు దూరమైన తర్వాత ఎంతో వేదనకు గురైందని ఆమె సన్నిహితులు పలుమార్లు వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరు విడిపోయినా.. స్నేహం అనే బంధం మిగిలి ఉన్న కారణంగా తను సుశాంత్‌ అంత్యక్రియలకు హాజరై అతడికి అంతిమ వీడ్కోలు పలికిందని తెలిపారు.  

Dear Ankita, with each passing day, one thought keeps haunting me over and over again. Kaash... I wish... We could have tried even harder, we could've stopped him, we could've begged him! Even when you both seperated, you only prayed for his happiness and success... Your love was pure. It was special. You still haven't removed his name from the nameplate of your house❤️ I miss those days, when the three of us stayed together in lokhandwala as a family, we shared so many moments which bring tears to my heart today...cooking together, eating together, ac ka paani girna, our special Mutton bhaat, our long drives to uttan, lonavala or Goa! Our crazy holi! Those laughs we shared, those sensitive low phases of life when we were there for each other, you more than anyone. The things you did to bring a smile on Sushant's face. Even today, I believe that only you two were made for each other. You both are true love. These thoughts, these memories are hurting my heart...how do I get them back! I want them back! I want 'us three' back! Remember the Malpua!? And how he asked for my mother's Mutton curry like a little kid! I know that only you could've saved him. I wish you both got married as we dreamt. You could've saved him if he just let you be there...You were his girlfriend, his wife, his mother, his best friend forever. I love you Ankita. I hope I never lose a friend like you. I won't be able to take it.

A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement