తెరపై సంజయ్‌గాంధీ స్టోరీ! | Sanjay Gandhi Story on the screen! | Sakshi
Sakshi News home page

తెరపై సంజయ్‌గాంధీ స్టోరీ!

Published Fri, Jul 3 2015 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

తెరపై సంజయ్‌గాంధీ స్టోరీ!

తెరపై సంజయ్‌గాంధీ స్టోరీ!

బాలీవుడ్‌లో ఇప్పుడు జీవితకథా చిత్రాలదే హవా అనిపి స్తోంది. సినీతారలు, రాజకీయ నేతల నుంచి క్రీడాకారుల వరకూ ఎవరినీ వదిలిపెట్టట్లేదు అక్కడి దర్శక, నిర్మాతలు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ‘ఇందిర’ అనే చిత్రంలో విద్యాబాలన్ టైటిల్ రోల్ చేయనున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజా కబురేమిటంటే ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ జీవితాన్ని వెండితెరపై చూపించడానికి బాలీవుడ్ దర్శక-నిర్మాత హన్సల్  మెహతా ఏర్పాట్లు చేస్తున్నారట.

ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతా రచన ‘ద సంజయ్ స్టోరీ’ ఈ చిత్రానికి ఆధారం. దేశంలో ‘ఎమర్జెన్సీ’ ఘట్టానికి 40 ఏళ్లయిన వేళ ఈ చిత్ర ప్రకటన రావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement