
బెజవాడలో సరైనోడు..
విజయవాడ: ‘సరైనోడు’ చిత్ర టీమ్ విజయవాడలో సందడి చేసింది. మూవీ సక్సెస్ మీట్ బుధవారం రాత్రి సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్లు రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ థ్రెస్సా, నటుడు ఆది, దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ స్టెప్పులేసి జనాలను ఆలరించారు. తారల సందడి, అభిమానుల ఆనందోత్సవాలతో ప్రాగంణం హోరెత్తింది.