
బచ్చన్ ఇంట్లో తారల దీపావళి సందడి
ముంబై: బాలీవుడ్ మెగా స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో దీపావళి రోజున బాలీవుడ్ స్టార్స్తో సందడి నెలకొంది. ప్రతి ఏడాదిలాగే ఈ దీపావళికి కూడా అమితాబ్ బాలీవుడ్ నటులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. నటులు షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, రన్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, టబు, షాహిద్ కపూర్, ఆలియా భట్, జాక్వేన్ ఫేర్నాండేజ్, కరణ్ జోహార్, సోనమ్ కపూర్, మాదవన్, వరుణ్ ధావణ్, క్రితిసనన్, తదితరులు అమితాబ్ కుటుంబంతో దీపావళి వేడుక జరుపుకున్నారు.
సంప్రదాయక దుస్తుల్లో వచ్చిన నటీమణులు ఈ పార్టీకి ఆకర్షణగా నిలిచారు. తమ ఇంచికి వచ్చిన అతిథులను బిగ్ బీ కుటుంబసభ్యలు ఐశ్వర్యరాయ్బచ్చన్, అభిషేక్ బచ్చన్, జయ బచ్చన్లు కలుసుకొని ఆప్యాయంగా పలకరించారు.