ఆగస్టు 7న 'శ్రీమంతుడు' విడుదల | srimanthudu movie release on august 7 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 7న 'శ్రీమంతుడు' విడుదల

Published Thu, Jun 18 2015 11:20 AM | Last Updated on Thu, Jul 25 2019 5:39 PM

ఆగస్టు 7న 'శ్రీమంతుడు' విడుదల - Sakshi

ఆగస్టు 7న 'శ్రీమంతుడు' విడుదల

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' విడుదల తేదీ మారింది. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జూలై 18న ఆడియో ఆవిష్కరించనున్నారు. జూలై రెండో వారంలో ఈ సినిమా విడుదల చేయాలని మొదట భావించారు. అయితే అదే వారంలో 'బాహుబలి'  చిత్రం విడుదలకానుంది.

ఒకే వారంలో రెండు పెద్ద సినిమాలు విడుదలయితే నిర్మాతలు నష్టపోయే అవకాశముందని, అందుకే 'శ్రీమంతుడు' విడుదల తేదీని ఆగస్టు 7కు మార్చినట్టు సమాచారం. నిర్మాతల మధ్య కుదిరిన పరస్పర అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 'శ్రీమంతుడు' కోసం మహేష్ బాబు అభిమానులు ఆగస్టు వరకు ఆగాల్సిందే. కాగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాను జూలై 10న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement