మీ ప్రేమకు థాంక్స్: మహేశ్ బాబు | mahesh babu thanks fans on 50 days of srimanthudu | Sakshi
Sakshi News home page

మీ ప్రేమకు థాంక్స్: మహేశ్ బాబు

Published Mon, Sep 28 2015 11:05 AM | Last Updated on Thu, Jul 25 2019 5:39 PM

మీ ప్రేమకు థాంక్స్: మహేశ్ బాబు - Sakshi

మీ ప్రేమకు థాంక్స్: మహేశ్ బాబు

శ్రీమంతుడు సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ పలు కేంద్రాల్లో ఆ సినిమా విజయవంతంగా నడుస్తోంది. దాంతో అభిమానులకు మహేశ్ బాబు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. బేషరతుగా ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెబుతూ.. లవ్ యు ఆల్ అన్నాడు. దాంతోపాటు సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ట్రైలర్ను కూడా యూట్యూబ్ ద్వారా విడుదల చేసి, ఆ లింకును తన ట్వీట్తో పాటు అందించాడు.

బాహుబలి లాంటి పెద్ద సినిమా విడుదలైన తర్వాత వచ్చిన శ్రీమంతుడు కూడా మంచి హిట్ కావడంతో మొత్తం యూనిట్ అంతా మంచి సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు మహేశ్ బాబు ప్రత్యేకంగా ఒక ఆడి కారును కూడా బహూకరించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement