సక్సెస్ టానిక్ హిట్ పెయిర్
Published Wed, Feb 5 2014 3:38 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
సక్సెస్ ఏ కళాకారుడికైనా మంచి టానిక్ లాంటిది. సినిమా సక్సెస్‌కు కారణాలెన్ని ఉన్నా దృష్టి పడేది మాత్రం హీరో హీరోయిన్లపైనే. జంట బాగుంది. ఇద్దరి మధ్య కెమి స్ట్రీ, ఫిజిక్స్ చక్కగా వర్కౌట్ అయ్యాయన్న టాక్ వస్తే ఇంకేముంది ఈ జంటపై క్రేజ్ పెరిగిపోతుంది. ప్రేక్షకులు ఎటూ వారి తొలి చిత్రాన్ని ఆదరించారు కాబట్టి ఆ జంటతో మళ్లీ మళ్లీ చిత్రాలు చేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ నడిచినా మధ్యలో మారింది. తాజాగా యువ దర్శకులను పాత ట్రెండే తారకమంత్రంగా మారింది. హీరోలు హీరోయిన్లు కూడా నటించడానికి సై అంటున్నారు. అలా చిత్రం తరువాత చిత్రం చేసినా, చేస్తున్న హీరో, హీరోయిన్ల వరుసలో విజయ్, కాజల్ అగర్వాల్, ఆర్య, హన్సిక, ఉదయనిధి స్టాలిన్, నయనతార, విమల్, బిందుమాధవి ఉన్నారు.
తుపాకీ జంట
నిజానికి కాజల్ అగర్వాల్ మొన్న టి వరకు కోలీవుడ్‌లో సక్సెస్ ఖాతాను ఓపెన్ చేయలేదు. పైగా ఐరన్‌లెగ్ ముద్ర కూడా వేసుకున్నారు. అలాంటిది టాలీవుడ్‌లో సక్సెస్ అవడంతో కోలీవుడ్‌లో ఇళయదళపతి విజయ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ వరించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో కాజల్ అగర్వాల్ సక్సెస్ ఖాతాను తెరిచారు. అంతేకాదు ఈ చిత్రంతో హిట్ పెయిర్‌గా ప్రచారం పొందిన విజయ్‌తో, కాజల్ అగర్వాల్ వెంటనే జిల్లా చిత్రంలో నటించడానికి బుక్ అయిపోయారు. ఈ చిత్రం విజయం బాట పట్టింది. అలా వరుసగా నటిస్తున్న మరో జంట ఉదయనిధి స్టాలిన్ నయనతార. వీరిద్దరూ నటించిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ఇది వీరిద్దరూ కలసి నటించిన తొలి చిత్రం. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో తదుపరి చిత్రంలోనూ ఉదయనిధి స్టాలిన్ తనకు జంటగా నయనతారనే ఎంపిక చేసుకున్నారు. వీరిద్దరి కలయికలో తదుపరి నన్భండా చిత్రం ప్రారంభం కానుంది.
ఆర్యతో హన్సిక మరోసారి
ఇక కోలీవుడ్‌లో హీరోయిన్ల డ్రీమ్ హీరోగా ముద్ర పడిన ఆర్యతో హన్సిక జంటగా సేట్టై చిత్రంలో నటించారు. చిత్రం హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోయిన్లను రిపీట్ చేయని ఆర్య హన్సికతో మరోసారి జత కట్టడానికి సిద్ధమయ్యారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న మెగామాన్ చిత్రంలో ఆర్య, హన్సికలే బుక్ అవడం విశేషం.
విశాల్ సైతం :
యువ నటుడు విశాల్ సైతం హిట్ పెయిర్ సెంటిమెంట్ వాడుతున్నారు. ఈయన తొలిసారి నిర్మాతగా మారి నటించిన పాండియనాడు చిత్రంలో లక్ష్మీమీనన్ హీరోయిన్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో తదుపరి నటిస్తూ నిర్మిస్తున్న నాన్ సిగప్పు మణిదన్ చిత్రంలోనూ లక్ష్మీమీనన్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. అదే బాటలో యువ నటుడు విమల్‌తో నటి బిందుమాధవి రిపీట్ అవుతున్నారు. వీరిద్దరూ ఇంతకుముందు కేడి బిల్లా కిల్లాడి రంగా చిత్రంలో జత కట్టారు. ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. దీంతో దేసింగు రాజాలో ఈ జంట మరోసారి తెరపై మెరిసిం ది. ఈ చిత్రం సక్సెస్ అవడంతో విమల్, బిందుమాధవి హిట్ పెయిర్ అని ప్రచారంలో వున్నారు. అదే విధంగా మరో యువ నటుడు శివకార్తికేయన్ తన హిట్ పెయిర్‌ను రిపీట్ చేస్తున్నారు. ఈయన నటించిన వరుత్త పడాద వాలిబర్ సంఘం సూపర్‌హిట్ అయ్యింది. ఇందులో టాలీవుడ్ బ్యూటీ శ్రీ దివ్య హీరోయిన్. ఇప్పుడు వీళ్లిద్దరూ కలసి దురై సెంథిల్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందుకే హిట్ అయితే రిపీటే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హిట్ కాంబినేషన్‌కు వ్యాపారపరంగాను లాభసాటిగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
Advertisement
Advertisement