
దక్షిణాదిలో నటుడిగా టాప్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మోహన్‌లాల్. అద్భుతమైన నటనతో కంప్లీట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న మోహన్‌లాల్ మరో అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నాడు. నటుడిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మోహన్‌లాల్ మెగాఫోన్ పట్టనున్నారు.
చాలా కాలంగా దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్న మోహన్‌లాల్, సరైన కథ దొరకటంతో డైరెక్టర్‌గా మారే పనిలో బిజీ అయ్యారు. తొలి ప్రయత్నంగా ఓ భారీ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారు. బరోజ్ పేరుతో 3డీ బహు భాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. వాస్కోడ గామా దగ్గర ట్రెజరర్‌గా పనిచేసిన బరోజ్ అనే వ్యక్తి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లే అవకాశం ఉంది.