![Superstar Mahesh Maharshi In Final Stages Of Shoot - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/27/Mahesh%20Babu.jpg.webp?itok=UpwMhdhb)
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మహర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మార్చి 15నాటికి రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తవుతుంది.
మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు నిర్ణయించారు చిత్రయూనిట్. సూపర్‌స్టార్ మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment