ఎక్స్‌పెండబుల్స్ సీక్వెల్‌లో సల్మాన్? | Sylvester Stallone and Salman Khan together in 'The Expendables' and not 'Sultan'? | Sakshi
Sakshi News home page

ఎక్స్‌పెండబుల్స్ సీక్వెల్‌లో సల్మాన్?

Published Mon, Oct 19 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

ఎక్స్‌పెండబుల్స్ సీక్వెల్‌లో సల్మాన్?

ఎక్స్‌పెండబుల్స్ సీక్వెల్‌లో సల్మాన్?

హై వోల్టేజ్ హాలీవుడ్  యాక్షన్ ఫ్రాంచైస్ ‘ఎక్స్‌పెండబుల్స్’లో  మన కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తే..?! ఆయన అభిమానులకే కాక, యావత్ భారతీయ సినీ ప్రేక్షకులకు కూడా కన్నుల పండగే. సల్లూభాయ్ అభిమానులు కూడా తమ హీరో ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తే చూడాలని ఎంతో కాలం నుంచి ఉవ్విళ్లూరుతున్నారు. వారి కోరిక నెరవేరే అవకాశం ఉందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్‌కు సల్మాన్‌ఖాన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.

 ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిద్దామని ట్విటర్ వేదికగా అనుకున్నారు కూడా. ‘కంబక్త్ ఇష్’  అనే చిత్రంలో తొలిసారిగా స్టాలోన్ బాలీవుడ్ తెరపై తళుక్కున మెరిశారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘సుల్తాన్’లో స్టాలోన్ కనిపించనున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే, సిల్వెస్టర్ స్టాలోన్ ‘ఎక్స్‌పెండబుల్స్’ సీక్వెల్‌లో సల్మాన్ నటిస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement