33 వసంతాల త్రిష | Trisha celebrates birthday with family, friends | Sakshi
Sakshi News home page

33 వసంతాల త్రిష

Published Thu, May 5 2016 5:58 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

33 వసంతాల త్రిష

33 వసంతాల త్రిష

అందాల తార త్రిష బుధవారం 33వ వసంతంలోకి అడుగు పెట్టారు. అదేనండీ తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. 13 ఏళ్ల కిత్రం లేసా చిత్రం ద్వారా దర్శకుడు ప్రియదర్శిన్ త్రిషను కథానాయికగా పరిచయం చేశారు. అయితే ఆ తరువాత సూర్యతో రొమాన్స్ చేసిన మౌనం పేసియదే చిత్రం ముందుగా తెరపైకి రావడంతో అదే ఈ చెన్నై చిన్నదాని తొలి చిత్రంగా నమోదైంది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో త్రిష నటిగా వెనుదిరిగి చూడలేదు. అజిత్, విజయ్, విక్రమ్, కమలహాసన్ లాంటి ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారు. తమిళంలోనే కాదు తెలుగులోనూ ప్రముఖ కథానాయికగా వెలుగొందుతున్న ఈ తార కన్నడం, హిందీ భాషల్లోనూ ఒక్కో చిత్రం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన ఎన్నై అరిందాల్, తూంగావనం, భూలోకం చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో పుల్ స్ప్రింగ్‌లోకి వచ్చిన త్రిష తర్వాత నటించిన అరణ్మణై-2 చిత్రం ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం ధనుష్‌తో నటిస్తున్న కొడి, లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందుతున్న నాయకి చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఒక నక్షత్ర హోటల్‌లో స్నేహితుల మధ్య 33వ  పుట్టిన రోజును వేడుకగా జరుపుకున్న త్రిష మాట్లాడుతూ తానిప్పుటికీ కథానాయికగా ప్రముఖ స్థానంలో వెలుగొందుతున్నానంటే అందుకు అభిమానులే కారణం అన్నారు.

ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తె లిపారు. తనను నాయికగా పరిచయం చేసిన దర్శకుడు ప్రియదర్శిన్‌కు, మంచి అవకాశాలు ఇచ్చి ఆదరిస్తున్న నిర్మాతలకు, సహ నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాను నటిస్తున్న నాయకి చిత్రం తనకు మరింత పేరు తెచ్చిపెడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈమె నాయకి చిత్రంకోసం తొలి సారిగా ఒక పాట పాడారు. ఆ పాట ఆల్బమ్‌ను తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఇది త్రిష అభిమానులకు విందు అవుతుందని నాయకి చిత్ర యూనిట్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement