రెండు రోజుల్లో 21.30 కోట్ల రూపాయలు
ముంబై: సెన్సార్ బోర్డుతో వివాదాల అనంతరం విడుదలైన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాకు తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. ఈ నెల 17న విడుదలైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో మొత్తం 21.30 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలి రోజు 10.5 కోట్లు రాగా, రెండో రోజు 11.25 కోట్ల రూపాయలు వచ్చాయి.
ఈ సినిమాకు ఎక్కువగా పంజాబ్, ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. అభిషేక్ చాబే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కరీనా కపూర్, షాహిద్ కపూర్, అలియా భట్ తదితరులు నటించారు.